Showing posts with label Good Manners. Show all posts
Showing posts with label Good Manners. Show all posts

Monday, August 4, 2025

భయానికి బై..బై..!

 

భయానికి బై..బై..!



పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. మంచి స్కూల్లో చేర్పించడం, మంచి మార్కులు వచ్చేలా చూడటం, వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పించడం... ఈ క్రమంలో, మనం వారికి తెలియకుండానే ఎన్నో ఒత్తిళ్లకు గురిచేస్తాం. అవే భవిష్యత్తులో వారి మనసులో ఒక రకమైన భయాన్ని, ఆందోళనను నింపుతాయి.

ఈ బ్లాగ్ పోస్ట్ లో పిల్లలు ఎదుర్కొనే భయాలు, వాటికి పరిష్కారాలు గురించి తెలుసుకుందాం.

1. స్కూల్ ఫోబియా

  • లక్షణాలు: పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్ళాలంటే ఏడుస్తారు, కడుపునొప్పి, తలనొప్పి అని అంటారు, వాంతులు కూడా చేసుకుంటారు, స్కూల్లో టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతారేమో అని భయపడతారు.

  • కారణాలు: కొత్త వాతావరణం, తోటి పిల్లలతో సరిగ్గా కలవలేకపోవడం, టీచర్ల పట్ల భయం, హోంవర్క్ చేయలేకపోవడం.

  • పరిష్కారం: పిల్లల పట్ల ఓపికతో వ్యవహరించాలి, స్కూల్ వాతావరణం పట్ల వారికి మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి, టీచర్ తో మాట్లాడి వారి పరిస్థితి వివరించాలి.

2. పరీక్షల భయం (ఎగ్జామ్ ఫోబియా)

  • లక్షణాలు: పరీక్షలంటే ఆందోళన, గుండె దడ, ఏకాగ్రత లోపం, చదివినదంతా మర్చిపోవడం.

  • కారణాలు: తల్లిదండ్రుల నుండి అధిక అంచనాలు, తక్కువ మార్కులు వస్తే తిడతారేమోననే భయం, తోటి వారితో పోలిక.

  • పరిష్కారం: పిల్లలకు పరీక్షల పట్ల సరైన అవగాహన కల్పించాలి, చదువును ఆనందించేలా చేయాలి, చిన్న చిన్న టార్గెట్లు ఇచ్చి వాటిని చేరుకునేలా ప్రోత్సహించాలి.

3. తోటి పిల్లల భయం (బూలీయింగ్)

  • లక్షణాలు: తోటి పిల్లలతో సరిగ్గా కలవలేకపోవడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, తమ వస్తువులను ఎవరితోనూ పంచుకోకపోవడం.

  • కారణాలు: ఇతర పిల్లలు తమను ఆటపట్టిస్తారేమోనని, కొడతారేమోనని భయం, తమను ఎవరూ ఇష్టపడరని భావించడం.

  • పరిష్కారం: పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి, వారికి తమకు ఇష్టం వచ్చిన వారితో స్నేహం చేసే స్వేచ్ఛ ఇవ్వాలి, ధైర్యంగా ఉండేలా ప్రోత్సహించాలి.

4. ఒంటరిగా ఉండటం (లోన్లీనెస్)

  • లక్షణాలు: ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, నిరాశగా ఉండటం.

  • కారణాలు: తల్లిదండ్రులు బిజీగా ఉండటం, స్నేహితులు లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం.

  • పరిష్కారం: పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలి, వారి అభిరుచులను ప్రోత్సహించాలి, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేలా చేయాలి.

5. భవిష్యత్తు భయం

  • లక్షణాలు: భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళన పడటం, కెరీర్ పట్ల భయం, పెళ్ళి గురించి భయం.

  • కారణాలు: మీడియా ప్రభావం, భవిష్యత్తు గురించి తప్పుడు సమాచారం, పెద్దల మాటలు.

  • పరిష్కారం: పిల్లలకు భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పధం కల్పించాలి, తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉంచేలా చేయాలి.

పిల్లలు ఎదుర్కొనే భయాలను మనం అర్థం చేసుకొని, సరైన పరిష్కారాలు చూపించినప్పుడు మాత్రమే వారు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు వెళ్తారు.

ఈ బ్లాగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Monday, July 1, 2019

Wife and Husband Relationship


Wife and Husband Relationship

Image result for Wife and Husband Relationship


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! :couple_with_heart:

:sparkling_heart: నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

:sparkling_heart: తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

:sparkling_heart: అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

Image result for Wife and Husband Relationship:sparkling_heart:
  ప్రతి భర్త తన భార్యను...
మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతి భార్య తన భర్తను..
మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...
ఇదే మధురమైన బంధం...
ఇప్పటికీ...
ఎప్పటికీ...

:sparkling_heart: భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

:sparkling_heart: సంసారం అంటే కలసి ఉండడమే కాదు.
కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

:sparkling_heart: ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ
అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...
మళ్లీ తన భార్య కళ్లలో
కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

:sparkling_heart: భార్యాభర్తల సంబంధం శాశ్వతం.
కొంతమంది మధ్యలో వస్తారు.
మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.
భర్తకు భార్య శాశ్వతం.

 

:sparkling_heart: ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...
గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!

:sparkling_heart: అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.
భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

:sparkling_heart: మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

:sparkling_heart: బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

:sparkling_heart: మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ,
తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

:sparkling_heart: కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా...
సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.
భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

:sparkling_heart: నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

:sparkling_heart: ప్రేమ అనేది చాలా విలువైనది.
దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

:sparkling_heart: సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

:sparkling_heart: గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...
ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

:sparkling_heart: పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.
ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

:sparkling_heart: వివాహ వార్షికోత్సవం అంటే
ప్రేమ,
విశ్వాసం,
భాగస్వామ్యం,
సహనం,
ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

:sparkling_heart: నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

:sparkling_heart: సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

:sparkling_heart: కోరుకున్న ఇంతి...
నేడు నీ సతి...
నేడు పట్టుకున్న ఆమె చేయి...
విడవకు ఎన్నటికీ.

:sparkling_heart: వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.
పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

:sparkling_heart: కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

:sparkling_heart: బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.
ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ...
మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

:sparkling_heart: మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం
(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదు
ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

Image result for Wife and Husband Relationship:sparkling_heart:
  భర్తకి భార్య బలం కావాలి
బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదు
భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.

:sparkling_heart: మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

:sparkling_heart: అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే
ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

:sparkling_heart: పెళ్లి అంటే
ఈడూ-జోడూ,
తోడూ-నీడా,
కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

:sparkling_heart: ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.
కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.
:bouquet::bouquet::bouquet::bouquet::bouquet::bouquet::bouquet::bouquet::bouquet::bouquet:
Related Posts Plugin for WordPress, Blogger...