Saturday, December 9, 2017

బ్రూస్ లీ .. Bruce Lee




 బ్రూస్ లీ ..
Bruce Lee

➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
★అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.

● కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె  షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు.

● బ్రూస్ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించే వారు.చైనీయుల సాంప్రదాయ క్రీడ యైన కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించే వాడు.

♻బాల్యం:
●బ్రూస్ లీ కాలిఫోర్నియా  రాష్ట్రంలోని శాన్‌ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించి. హాంకాంగ్ లో పెరిగాడు. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం  డ్రాగన్  సంవత్సరం.

♻నటనా జీవితం:
● బ్రూస్ లీ 1973 వ సం"లో  ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ, ఆతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.

♻ శారీరక ధారుడ్యము, పౌష్టికాహారం:

● అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిష నింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయప డేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. 'వింగ్ చున్' విధానంలోని 'వన్ ఇంచ్ పంచ్'కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు.

 ●1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్ట మొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు.

 ● సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఆబ్జెక్ట్‌కు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుంద న్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షర సత్యమని నిరూపించాడు బ్రూస్ లీ.

 ● ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభ వం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ఉన్నంతకాలం  బతికే ఉంటాడు.

♻బ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలు:

● స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి...బ్రూస్ లీ. 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

● బ్రూస్ లీ అసలు పేరు 'లీ జూన్ ఫాన్'.ఈ చైనా ఫైటర్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో పుట్టాడు. బ్రూస్ లీ ప్రైవేట్‌గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పటానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవాడు.

 ● ఫైటింగ్‌లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటేవేగంగాకదులుతుంది.ఈ వేగాన్ని నిరూపించ టం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించే వాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చు కునే వాడు.ఒక అంగుళం దూరం నుంచే పవర్‌ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి.

⭕మరణం:
● మే 10, 1973 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపో యాడు.మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్  బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికీ బ్రూస్ లీ కోమా లోకి వెళ్ళిపో యారు. ఒక గంటలో చనిపోయాడు.

...కానీ అతని సాహసాలు,మన మది లో మెదులుతూనే ఉన్నాయిగా...
(నవంబర్27,1940-జులై 20, 1973)
Related Posts Plugin for WordPress, Blogger...